- నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రి సమీపంలోని ఫ్లైఓవర్‌పై..
- ఆదివారం జరిగిన ప్రమాదం.కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం..
- సురక్షితంగా బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్.
నల్గొండ బ్యూరో, సెప్టెంబర్ 28 (న్యూస్ పేజ్) :
నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రి వద్ద ఉన్న ఫ్లైఓవర్‌పై ముందు వెళ్తున్న ఒక భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా యూటర్న్ తీసుకుంది. ఈ క్రమంలో వెనుకనే వేగంగా వస్తున్న అడిషనల్ కలెక్టర్ కారు.. బ్రేక్ వేసే లోపే ఆ కంటైనర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ధ్వంసమైన కారును ఇన్సూరెన్స్ ప్రక్రియ నిమిత్తం హైవేపైనే భద్రపరిచారు. ప్రమాదం అనంతరం పోలీసులు వేణుగోపాల్‌కు ప్రథమ చికిత్స అందించి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సివిల్ సప్లైస్ అధికారికి చెందిన ప్రత్యామ్నాయ కారులో ఆయన సురక్షితంగా కొత్తగూడెంకు బయలుదేరి వెళ్లారు.
ముఖ్యాంశాలు
తప్పిన ప్రాణాపాయం: ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో అడిషనల్ కలెక్టర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రమాద వాహనాన్ని పోలీసులు పక్కకు తొలగించారు.
మొత్తానికైతే..హైవేలపై భారీ వాహనాలు అజాగ్రత్తగా యూటర్న్‌లు తీసుకోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలో అడిషనల్ కలెక్టర్ సురక్షితంగా బయటపడటం అదృష్టమని స్థానికులు పేర్కొంటున్నారు.
