- పోటాపోటీ వేలం.. కైవసం చేసుకున్న సిహెచ్. ఈశ్వర్ గౌడ్
- లడ్డూ దక్కడం మా పూర్వజన్మ సుకృతం: మాజీ వైస్ చైర్మన్ సిహెచ్. శ్రీనివాస్ గౌడ్
❝ భగవంతుని కృపతోనే ఇది సాధ్యమైంది. వినాయకుని పవిత్ర లడ్డూ ప్రసాదం మాకు దక్కడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఆ గణనాథుని ఆశీస్సులతో సర్వ విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. ఈ మహా ప్రసాదాన్ని భక్తులందరికీ అందజేస్తాం. ❞
- సిహెచ్. శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సదాశివపేట
సదాశివపేట, న్యూస్ పేజ్ ;
పట్టణంలోని పాత కేరిలో వెలసిన ‘నవ సమాజ్ యూత్ అసోసియేషన్’ గణనాథుని లడ్డూ వేలంపాట ఆదివారం అత్యంత కోలాహలంగా, ఉత్కంఠభరితంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పోటీపడగా, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిహెచ్. శ్రీనివాస్ గౌడ్ కుమారుడు సిహెచ్. ఈశ్వర్ గౌడ్ అత్యధికంగా ₹1,21,000/- (లక్షా ఇరవై ఒక్క వేయి రూపాయలు) వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు.
లడ్డూ వేలం సందర్భంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. ఈ పవిత్ర ప్రసాదాన్ని కాలనీవాసులకు, భక్తులకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్ ఫణి కృష్ణ, కంది కృష్ణ, ప్రముఖులు నాగరాజు గౌడ్, నరసింహ గౌడ్, వీరేందర్ గౌడ్, గణేష్ గౌడ్, రమేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సన్నె గౌడ్, పాలనేత్ర గౌడ్ మరియు యూత్ సభ్యులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
