- సంగారెడ్డిలో నేడు ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్
సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :
సంగారెడ్డి పట్టణంలోని చౌహాన్ ఫంక్షన్ హాల్లో అక్టోబర్ 2న నిర్వహించనున్న ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు అందజేయనున్న మెడల్స్, బహుమతులను గురువారం నిర్వాహకులు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఎండీ సాజిద్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
