రేపు సంగారెడ్డిలో జీపీవోల కృతజ్ఞత సభ

గ్రామ పాలనాధికారులుగా (జీపీవో) నియామకం జరిగి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలో భారీ 'కృతజ్ఞత సభ' నిర్వహిస్తున్నారు.

  • ​ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఆహ్వానం
  • “గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే.. 
  • కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి సొంత శాఖల్లోకి తీసుకువచ్చింది”
Leaders of the GPO Association extended a warm welcome to former MLA and TPCC Working President Thurpu Jayaprakash Reddy (Jagga Reddy).

సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :

గ్రామ పాలనాధికారులుగా (జీపీవో) నియామకం జరిగి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం సంగారెడ్డిలో భారీ 'కృతజ్ఞత సభ' నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని జీపీవోల సంఘం నేతలు సాదరంగా ఆహ్వానించారు.  ​గురువారం సంగారెడ్డి స్థానిక ఐబీ అతిథి గృహంలో సంఘం ప్రతినిధులు జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.  

​కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు:

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వీఆర్వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమకు న్యాయం జరిగిందని, తిరిగి తమ స్వంత శాఖల్లోకి చేరడానికి మార్గం సుగమమైందని గుర్తుచేశారు. గ్రామ పాలనాధికారులుగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దీనిపై జగ్గారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, విధుల్లో ఏడాది పూర్తి చేసుకున్న జీపీవోలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.  

​కార్యక్రమంలో పాల్గొన్న నేతలు:

జగ్గారెడ్డిని కలిసిన వారిలో జీపీవోల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సహాయ కార్యదర్శి సుజాత, సంఘం నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...