ఆర్టీసీ విలీనం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం - నిర్మల జగ్గారెడ్డి

. ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో TJMU రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి హనుమంతుకు మద్దతుగా సంగారెడ్డిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

  • కార్మికుల హక్కుల కోసం TJMU పోరాటం: నిర్మల జగ్గారెడ్డి
  • గద గుర్తుకు ఓటేసి హనుమంతును గెలిపించాలని పిలుపు

TJMU Fights for Workers' Rights: Nirmala Jaggareddy

సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో TJMU రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి హనుమంతుకు మద్దతుగా సంగారెడ్డిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నిర్మల జగ్గారెడ్డితో పాటు TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సంగారెడ్డి డిపో గౌరవ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికుల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఎన్నికల అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను హీనంగా చూసిందని ఆమె విమర్శించారు.

కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న హనుమంతు మంచి వ్యక్తి అని పేర్కొన్న నిర్మల జగ్గారెడ్డి, అక్టోబర్ 9న జరిగే ఆర్టీసీ కార్మికుల ఎన్నికల్లో గదా గుర్తుకు ఓటు వేసి హనుమంతును గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హనుమంతు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు.

ఆర్టీసీ విలీనాన్ని ఇతర సంఘాల నాయకులు అడ్డుకుంటున్నారని TJMU రాష్ట్ర కార్యదర్శి అభ్యర్థి హనుమంతు ఆరోపించారు. కార్మికుల అవసరాలను అడ్డుపెట్టుకుని చందాల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అండతో TJMU విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, కార్మికుల సమస్యల పరిష్కారం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

సంగారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో పలువురు TJMU నాయకులు, ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...