సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ!

సీఎం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ హనుమకొండ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం – తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరసిస్తూ హనుమకొండ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం 
  • తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
  • బీజేపీ నాయకులు రావు పద్మ రెడ్డి, పగడాల కాళీప్రసాద్ రావు డిమాండ్.

CM Revanth Reddy's anti-Hindu remarks spark BJP outrage!

హనుమకొండ బ్యూరో, న్యూస్ పేజ్ :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు బీజేపీ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన బీజేపీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు మరియు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ కాండిడేట్ శ్రీ పగడాల కాళీప్రసాద్ రావు గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో రాముడు, శివుడు వేరు కాదని, స్వయంగా శ్రీరాముడే ఆ మహాదేవుడిని ఆరాధించాడని గుర్తుచేశారు.

 "దేవుళ్లను, కులాలను, ప్రాంతాలను వేరు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సమాజంలో విద్వేష విషాన్ని చిమ్ముతోంది. ఖైరతాబాద్ ఉపఎన్నిక రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఈ తరహా హిందూ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతున్నారు" అని మండిపడ్డారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం రామాలయం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, శ్రీరాముడికి, పరమశివుడికి మధ్య ఉత్తర-దక్షిణ సరిహద్దులు గీయడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. 

సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని మన్యంకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయమే హరిహర క్షేత్రానికి ప్రతీక అని, అటువంటి నేల నుండి వచ్చిన సీఎం దేవుళ్ల మధ్య విభజన తేవడం సిగ్గుచేటన్నారు. 

ఎన్నికల వేళ దేవుళ్ల పేరిట ప్రమాణాలు చేసి ఓట్లు అడిగిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే దేవుళ్లకు కులం, ప్రాంతం అంటగట్టడం దారుణమని ధ్వజమెత్తారు.

హిందూ సమాజ భావోద్వేగాలను దెబ్బతీసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పి.జయంత్ లాల్, జిల్లా నాయకులు ఆకుల శ్రీకాంత్ పటేల్, బైరి శ్రావణ్, బొమ్మసాని అనిల్, జరీనా, ధనలక్ష్మి, కొండెం రవీంద్ర రెడ్డి, భారత్ గౌడ్, శ్రీరాంరెడ్డి, పున్నం వేణు, మాజీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...