భగత్ సింగ్ స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి

  • ఏఐఎఫ్ బి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో.. 
  • భగత్ సింగ్ 120 వ జయంతి వేడుకలు.
  • ఏ ఐ ఎఫ్.బి  జిల్లా  కన్వీనర్ అతికం హకీమ్ నవీద్ 

Bhagat Singh's 120th Birth Anniversary Celebrated in Warangal District Headquarters Under the Aegis of AIFB


వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :

వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టేవాడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో  భగత్ సింగ్ 120 వ  జయంతి  వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్ హకీమ్ నవీద్ పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి  పూలమాలవేసి నివాళులర్పించారు 

 ఈ సందర్భంగా  హకీమ్ నవీద్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ బ్రిటిష్  పరాయి పాలకుల గుండెల్లో గుబుళ్లు పుట్టించిన యోధుడు భగత్ సింగ్ ఆయన అభివర్ణించారు అతి చిన్న వయసులో ఉరికంబాన్ని చిరునవ్వుతో ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ ఆయన ఆశయాల సాధనకు  సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి  యువత, విద్యార్థులు బలమైన పోరాటాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  నాయకులు ముజ్జు, కొక్కెర్ల ప్రవీణ్ , అహ్మద్, అజమ్, మన్సూర్ , తాజుద్దీన్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...